ఓమిక్రాన్ కేసుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం ..

two-hundred-omicron-cases-reported-in-india-so-far

దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట్లో ఒకటి , రెండే అనుకున్నప్పటికీ..ఇప్పుడు 257 కు చేరింది. ఇక తెలంగాణ ఓమిక్రాన్ కేసుల్లో దేశంలోనే మూడోస్థానంలో ఉండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న తెలంగాణలో కొత్తగా 14 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో నిన్న కొత్త కేసులతో కేసుల సంఖ్య 38కి చేరింది. ఇక కేరళలో 9, రాజస్థాన్ 4, ఢిల్లీ 3, బెంగాల్ 2, ఏపీలో 1 కేసు నమోదైంది. దీంతో పాటు హర్యాన్ రాష్ట్రంలో తొలిసారిగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 6 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 257కు పెరిగింది.

ఇక కరోనా నిన్న దేశ వ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వస్తే..దేశంలో కొత్త‌గా 7,495 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగూ, నిన్న‌ 6,960 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో మొత్తం 78,291 మంది చికిత్స తీసుకుంటున్నారు.