ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

Soyam Bapu Rao
Soyam Bapu Rao

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రకటనతో తెలంగాణలోనూ కొత్త డిమాండ్లు తలెత్తున్నాయి. ఇకపై తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఆదిలాబాద్‌లో నిర్వహించాలంటూ బిజెపి ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు. ఏడాదిలో రెండుసార్లు ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం తెలంగాణలో సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇదే విషయమై సీఎం కెసిఆర్‌కు తెలియజేశానని, అలాగే త్వరలోనే గవర్నర్‌ను కలిసి తన డిమాండ్‌ గురించి చెబుతానని బాబురావు అన్నారు. హైదరాబాద్‌కు ఆదిలాబాద్‌ చాలా దూరంలో ఉందని అందుకే ఏడాదికి కనీసం రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు అక్కడ నిర్వహించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/