దిశ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక భేటీ

Mahmood Ali
Mahmood Ali

హైదరాబాద్‌: దిశ హత్యోదంతం విషయంలో యావత్‌ దేశం తన గొంతుకను వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాగా ఈ సమావేశంలో దిశ ఘటనలాంటివి మరోకటి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా యువతలో ఏర్పడే తప్పుడు ప్రవర్తనను తొలగించేందుకు విద్యా విధానంలో నైతిక విలువలు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కాగా లక్డీకాపూల్ లోని హోం మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డితోపాటు విద్య, మహిళా సంక్షేమ శాఖ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మహిళల భద్రత, అప్రమత్తతలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/