తేజు ఆక్సిడెంట్ : పోలీసులు కేసు పెట్టాల్సింది తేజు పైన..GHMC పైనా..?

సాయి ధరమ్ రోడ్డు ప్రమాదం ఫై నెటిజన్లు, అభిమానులు కొత్త ప్రశ్నలు రేకిత్తిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల వేళలో.. మాదాపూర్ లోని ఐకియా రోడ్డు వద్ద తేజు నడుపుతున్న బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డాడు. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం మరియు రాష్ డ్రైవింగ్ అని తేజు ఫై ఐపీసీ 3, 36,184 ఎంవీ యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు పట్ల అభిమానులు పోలీసులకు పలు ప్రశ్నలు వేస్తున్నారు.

మాదాపూర్ రోడ్డులో ఎక్కడా లేని రీతిలో తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోడ్డు మీద ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉదయం ప్రమాదానికి కారణమైన ప్రాంతంలోని ఇసుకను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రోడ్డు మీద ఇసుక ఉన్న కారణంగా బండి స్కిడ్ అయిన విషయం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రోడ్డు మీద ఇసుక ఉన్నప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన జీహెచ్ఎంసీ ఎందుకు ఆ పని చేయలేదు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ఇసుక తొలగించకపోవడం వల్లే తేజు ప్రమాదానికి గురయ్యారు. అంతే తప్ప మరొకటి లేదు. అదే ఇసుక లేకపోతే తేజ్ ప్రమాదానికి గురై వారు కాదు. అలాంటప్పుడు కేసు పెట్టాల్సింది ఇసుక తొలగించని GHMC మీద కానీ రోడ్డు మీద వెళ్తున్న తేజు పైనా కాదని నెటిజన్ల వాదన.