స్వతంత్య్ర అభ్యర్థిగా సరన్‌ నుంచి తేజ్‌ ప్రతాప్‌!

tej pratap yadav
tej pratap yadav


పాట్నా: బీహార్‌ ఆర్జేడి పార్టీలో గందరగోళం నెలకొన్నది. ఆ పార్టీ నుంచి వీడినట్లు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఇక ఆ పార్టీ పొత్తులో భాగంగా సరన్‌ లోక్‌సభ స్థానాన్ని చంద్రికా రా§్‌ుకు కేటాయించింది. సోదరుడు తేజస్వి యాదవ్‌తో దూరంగా ఉంటున్న తేజ్‌ ప్రతాప్‌ లోక్‌సభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటున్నారు. సరన్‌ స్థానం నుంచి అతను పోటీకి సిద్ధమయ్యాడు. సరన్‌ నుంచి ఆర్జేడి అభ్యర్థిగా పోటీ పడుతున్నది తేజ్‌ ప్రతాప్‌ మామ. అంటే స్వయాన కూతురుని ఇచ్చిన మామ. చంద్రికా రా§్‌ు కుమార్తెనే తేజ్‌ ప్రతాప్‌ వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే భార్య ఐశ్వర్యతో బ్రేకప్‌ అయ్యింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/