తెలంగాణ ప్రభుత్వానికి తహసీల్దార్‌ సంఘం హెచ్చరిక

Telangana government
Telangana government

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తహసీల్దార్ల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన తహసీల్దార్లను తక్షణమే సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 15న సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయం తహసీల్దార్‌ సంఘం నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు నుండి నిరసన కార్యక్రమాలకు తహసీల్దార్ సంఘం పిలుపునిచ్చింది. కాగా ఆదివారం తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజీటీఏ కేంద్ర కార్యాలయంలో జరిగింది. తహసీల్దార్ల సమస్యలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/