జైలు లో ‘తీన్మార్’ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష

పోలీసుల తీరుపై అభిమానుల ఆగ్రహం

'Teenmar' Mallanna goes on a hunger strike in jail
‘Teenmar’ Mallanna goes on a hunger strike in jail

చంచల్ గూడ జైలు లో ఉన్న ‘తీన్మార్’ మల్లన్న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జైలులోనే ఆయన దీక్ష చేపట్టారు. అక్రమ కేసులకు నిరసనగా.. మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జగదేవ్ పూర్ లో తీన్మార్ మల్లన్నపై మరి కొన్ని అక్రమ కేసులు నమోడు చేసినట్టు తెలిసింది. కాగా , పోలీసుల తీరుపై మల్లన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. తెలంగాణ పోలీసుల తీరుపై మేధావులు, వివిధ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/