చెన్నై రైల్వే స్టేషన్లలో ప్రేమికులకు పోలీసులు ఆంక్షలు

చెన్నై రైల్వే స్టేషన్లలో ప్రేమికులకు పోలీసులు ఆంక్షలు
Teenage lovers

Chennai: చెన్నై రైల్వే స్టేషన్లలో ప్రేమికులకు పోలీసులు ఆంక్షలు విధించారు. రెండేళ్ల నుండి రైల్వేస్టేషన్లలో యువతులపై ఆకతాయిల దాడులు పెరిగిపోతున్నాయి. రైల్వేస్టేషన్లలో గంటల తరబడి వేచి ఉండే జంటలను రైల్వే భద్రతా దళం పోలీసులు తరిమికొట్టడంతో పాటు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం పంపనున్నారు. నగరంలోని బీచ్‌ – చెంగల్పట్టు, తిరుమల్‌పూర్‌, సెంట్రల్‌ – తిరువళ్ళూరు, అరకోణం, తిరుత్తణి, బీచ్‌ – వేళచ్చేరి మార్గాలలో రైల్వేస్టేషన్లలో బల్లలపై ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, పావుగంటకు పైగా కబుర్లాడే జంటను స్టేషన్‌ నుంచి తక్షణమే వెళ్ళిపోమ్మంటూ ఆదేసించనున్నారు. త్వరలో చెన్నై రైల్వేజోన్‌లోని 136 రైల్వేస్టేషన్‌లలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయయనుండగా కూర్చుని కబుర్లాడే జంటలను రైల్వే పోలీసులు కంట్రోలు రూమ్‌ నుండి డేగకళ్ళతో నిఘావేసి తరమనున్నారు.