ఎదిగే తొందరలో..

ఇప్పటి ఆడపిల్లలకు 11, 12 సంవత్సరాలకే రజస్వలమవుతున్నారు. ఆహారపు అలవాట్లతో వారిలోని హార్మోన్లు వేగంగా పనిచేస్తున్నాయి. ఆడపిల్లలు 12-13 సం.లో రజస్వల (పుష్పవతి) అవ్ఞతారు. నెలసరి, రుతుచక్రం ప్రారంభం అవుతుంది. శరీరంలో మార్పులు, స్త్రీత్వ చిహ్నాలు కనబడటం మొదలవ్ఞ తుంది. శరీర స్పృహ పెరుగుతుంది. ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు.

Teenage
Teenage

మగపిల్లలతో ఇదివరకటి వలె చనువ్ఞగా ఉండకూడని వయసు ఇది. తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలన్నీ శ్రద్ధగా పాటించాల్సిన వయస్సు! (నేటి సామాజిక పరిస్థితులతోనయితే బాలికలు ఇంటాబయటా కూడా అనుక్షణం జాగరూకతతో, ఆత్మరక్షణా దృష్టితో మెలగుతూ ఉండటం ప్రారంభించాల్సిన వయస్సు!) 17-32వ సం.వరకు తరుణి, యువతి. ఇది వివాహం చేసుకుని, సంతానమును కనటానికి అత్యుత్తమమై వయస్సు ప్రౌఢావస్థ: 33-50సం.వరకు ప్రౌఢా. ఇది జీవితంలో మధ్య వయస్సు. శక్తియుక్తులు తారాస్థాయిలో ఉంటాయి.
పిల్లల పెంపకంలో మెలకువలు అనుభవంలోకి వస్తూంటాయి. 50వ సం.లోపల నెలసరి రుతుచక్రం ఆగిపోవటం జరుగుతుంది. 51వ సం. మెనోపాజ్‌ తరువాత హార్మోనులు సమతౌల్యం తగ్గటం మొదలవ్ఞతుంది. తమ పిల్లలకు వివాహాదులు, మనవ రాళ్ళతో ముద్దు మురిపాలూ ఉంటాయి. ఎవరికి మానవ సహాయం వారికి సహాయం చేసేందుకు వెళ్ళాల్సి వస్తూంటుంది.