సాంకేతిక పరిజ్ఞానం నేరాల పెరుగుదలకు కారణమవుతుంది

Sucharitha Home Minister Of AP
Sucharitha Home Minister Of AP

అమరావతి: సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అంశంపై సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ప్రారంభమైన సదస్సులో ఏపి హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు శత్రువులు ఎక్కడో లేరు మన చేతుల్లో ఫోన్‌ల రూపంలో ఉన్నారని ఆమె పేర్నొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేరాల పెరుగుదలకు కారణమవుతోందన్నారు. ఈ నేరాలకు ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు గురవుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ బాగుచేయించడానికి ఇస్తే దానిలో స్పై యాప్‌లు వేసి ఇస్తున్నారని సుచరిత పేర్కొన్నారు. మహిళలలో అవగాహన కల్పించి నేరాల బారిన పడకుండా ఈ సదస్సు ఉపయోగ పడుతోందన్నారు. ఈ సదస్సులో డీజీపీ గౌతమ్ సవాంగ్, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/