మైనర్‌ బాలికలపై స్వామిజీ అత్యాచారం

seer-rapes-two-minor-girls
seer-rapes-two-minor-girls

హర్యానా: ఇక్కడి కల్క ప్రాంతంలోని ఒక ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. వీరిపై ఆ ఆశ్రమం స్వామీజీయే అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు
అందింది. వరుసగా మూడురోజుల పాటు ఆ మైనర్ బాలికలపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డికి చెందిన ఈ ఇద్దరు మైనర్ బాలికలపై ఆశ్రమంలోనే స్వామీజీ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత బాలికల వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ ఆసుపత్రికి పంపి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/