మూడోటెస్టు విజయం కోసం భారత్ కసరత్తు

రాంచీ: ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన భారత్ జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోగా మూడో టెస్టులోనూ విజయం సాధించాలని తహతమలాడుతుంది. అందుకే తగ్గట్టే శనివారం ప్రారంభంమయ్యే మూడో టెస్టుకోసం కోహ్లిసేన కష్టపడుతుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌ను క్లీన్‌స్విప్ చేసేందుకు భారత్జట్టు పట్టుదలగా ఉంది. గురువారం రాంచీలో ప్రాక్టిసు చేస్తుండగా ఆ ఫోటోలను ట్విట్టర్లో బిసీసీఐ పంచుకుంది. ఈ మ్యాచును వీక్షించేందుకు మాజీ సారథి,వికెట్ కీపర్ మాహేంద్రసింగ్ ధోని తొలి రోజు ఆట చూడటానికి రానున్నాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో గెలవగా..పుణెలో జరిగిన రెండో మ్యాచులో 137 తెడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల్లోను సంపుర్ణ ఆధిపత్యం చెలాయించింది. కాగా రాంచీలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమైనందున మూడో టెస్టులో ఒక పేసర్‌ని తగ్గించి కుల్దీప్ యాదవ్ జట్టులోకి తీసుకుంటారని సమాచారం. ఈ విధంగా కోహ్లిసేన మరోసారి దక్షిణప్రికా పై విజయం సాదించటం ఖాయంగా కనిపిస్తుంది. భారతజట్టు స్వదేశంలో వరుసగా 11 టెస్టు సీరిస్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సాధించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/news/sports/