ప్రోకబడ్డీ మ్యాచ్‌కు హాజరుకానున్న విరాట్‌కోహ్లీ

Virat Kohli
Virat Kohli

ముంబయి: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ శనివారం ముంబయిలో జరిగే ప్రోకబడ్డీ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు. ప్రో కబడ్డీ ముంబయి లెగ్‌ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా అతడు జాతీయ గీతం ఆలపించి యు ముంబా, పునేరి పల్టాన్‌ మధ్య మ్యాచ్‌ను ప్రారంభించనున్నాడు. గతవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో పలు జట్లు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఈనెల 27న తొలి కబడ్డీ మ్యాచ్‌ జరగనుంది.


తాజా ఆంధ్రప్రదేశ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/