భారత్‌కు ఏడోసారి

TEAM INDIA
TEAM INDIA

200కు పైగా పరుగులు సమర్పించుకోవడం భారత్‌కు ఏడోసారి

హామిల్టన్‌: అంతర్జాతీయ టీ20ల్లో భారత జట్టు తొలుత ఫీల్డింగ్‌ చేసి ప్రత్యర్థి జట్టుకు రెండొందలకు పైగా పరుగుల్ని సమర్పించుకోవడం ఇది ఏడోసారి. ఆదివారం భారత్‌త జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ రెండొందలకు పైగా పరుగుల్ని సాధించి భారత్‌కు సవాల్‌ విసిరింది. ఈసిరీస్‌లోనే న్యూజిలాండ్‌ రెండొందలకు పైగా పరుగుల్ని రెండుసార్లు భారత్‌పై సాధించింది. ఫలితంగా ఒక ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో భారత్‌ 200, అంతకంటే ఎక్కువ పరుగుల్ని ప్రత్యర్థికి సమర్పించుకోవడం రెండోసారిగా నమోదైంది. అంతకుముందు 2009లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో భారత్‌ రెండు మ్యాచుల్లో రెండొందల పరుగుల్ని సమర్పించుకుంది. అయితే మొహాలీలో లంకేయులు 207పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా దాన్ని భారత్‌ ఛేదించింది. ఓవరాల్‌గా ప్రత్యర్థి జట్టు రెండొందలకు పైగా లక్ష్యాన్ని నిర్ధేశించిన గత ఆరు సందర్భాలకు గాను రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 2013లో ఆసీస్‌ నిర్ధేశించిన 202 పరుగుల్ని భారత్‌ ఛేదించింది. ధోనీ మెరుపు స్టంపౌట్‌ హామిల్టన్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని వికెట్ల వెనుక మరోసారి మెరిశాడు. న్యూజిలాండ్‌ వేదికగా ఆదివారం జరి గిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ధోని మెరుపు స్టంపౌట్‌ చేశాడు. కేవలం 0.099 సెకన్‌లో స్టంపౌట్‌ చేసి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓ వర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ బౌలిం గ్‌లో కివీస్‌ విద్వంసక ఓపె నర్‌ టిమ్‌ సీపర్‌ను క్రీజు వెలుపలికి వెళ్లి బం తిని ముం దుకు పుష్‌ చేసేం దుకు ప్రయ త్నించాడు. కానీ బ్యాట్‌కి అందని బంతి నేరుగా వికెట్‌ కీపర్‌ మ హేంద్రసింగ్‌ ధోని చేతు ల్లో కి వెళ్లింది.