వర్షాల దెబ్బకు ప‌డ‌వ‌ల్లోనే పిల్ల‌ల‌కు పాఠాలు

దాదాపు 18 నెలల తర్వాత పాఠశాలలు ఓపెన్ అయ్యాయని అంత అనుకున్నారో లేదో..ఇప్పుడు వర్షాలు బయటకు వెళ్లకుండా చేస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్కూల్ విద్యార్థులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే బీహార్ లో ప‌డ‌వ‌ల్లోనే పిల్ల‌ల‌కు పాఠాలు చెపుతున్న దృశ్యం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

క‌తియార్ జిల్లాలోని మ‌హ‌నీహ‌రి ప్రాంతంలో ఉపాద్యాయులు ప‌డ‌వ‌ల్లోనే విద్య‌ను బోధిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే విద్య‌కు విద్యార్థులు దూరం అయ్యార‌ని, ఇప్పుడు వ‌ర‌ద‌ల కార‌ణంగా విద్య‌కు విద్య‌కు దూరం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో ఈ విధంగా ప‌డ‌వ‌ల్లో విద్య‌ను బొధిస్తున్న‌ట్టు పంక‌జ్ కుమార్ అనే ఉపాద్యాయుడు చెప్పుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..స్కూల్స్ ఓపెన్ కాగానే కరోనా కేసులు పెరుగుతుండడం..వరుస పెట్టి పలు స్కూల్స్ లలో విద్యార్థులు, టీచర్లు వరుస పెట్టి కరోనా బారినపడుతుండడం తో తల్లిందండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. తమ బిడ్డలని పంపాలా..వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు.