టీచర్ల కార్పొరేట్‌స్థాయి జీతాలు

Teacher with students (FILE)

ఒకప్పుడు బతకలేనివాడు బడిపంతులు అనేవారు. ఇప్పుడు బాగా బతకాలంటే టీచర్‌ ఉద్యోగానికి మించింది మరొకటి లేదనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితుల్లో ఉపాధ్యాయ వృత్తి ఆకర్షణీయ వేతనాలతోపాటు అంతులేని సంతృప్తికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ నేపధ్యంలో స్కూల్‌ టీచర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు, అర్హతలపై కొన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రీప్రైమరీ విద్య: చిన్న పిల్లలు పాఠశాల విద్య ప్రారంభించే ముందు ప్రీప్రైమీ విద్య అనేది చాలా ముఖ్యం. ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా పిల్లల్లో భయం పోగొట్టి చదువుపై ఆసక్తి పెంచేందుకు ప్రీప్రైమరీ విద్య దోహదపడుతుంది. ఆ వయసులో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆడుకుంటూ, పొడుకుంటూ నేర్చుకోవడం అనేది పిల్లల మనో వికాసానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం మనదేశంలో 3-5ఏళ్ల పిల్లల కోసం ప్రీప్రైమరీ స్కూల్స్‌, ప్లే స్కూల్స్‌ పెరుగుతున్నాయి.

అదే సమయంలో కిండర్‌గార్డెన్‌ (కెజీ), ప్రీ నర్సరీ, నర్సరీ, లోయర్‌ కిండర్‌గార్డెన్‌ (ఎల్‌కెజీ), అప్పర్‌ కిండర్‌గార్డెన్‌(యూకెజీ)ల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రీప్రైమరీ విద్య ప్రధానంగా ప్రైవేటు స్కూల్స్‌లోనే అందుబాటులో ఉంటుంది.

అర్హతలు:

ప్రీప్రైమీ పాఠశాలల్లో టీచర్స్‌గా పనిచేయాలనుకునే వారి 10+2/ ఇంటర్‌ విద్యార్హతతోపాటు నర్సరీ టీచర్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌టిటి)లో ఏడాది సర్టిఫికేట్‌ లేదా డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా అవసరమైన మానవ వనరులను సంసిద్ధం చేయడమే ఎన్‌టిటి ప్రధాన ఉద్దేశం. ఎన్‌టిటి శిక్షణలో భాగంగా చైల్డ్‌ సైకాలజీ, చైల్డ్‌ కేర్‌ అండ్‌ హెల్త్‌, బేసిక్స్‌ ఆఫ్‌ ప్ప్రీమరీ ఎడ్యుకేషన్‌, హిస్టరీ అండ్‌ ఫిలాసఫీ ఆఫ్‌ ప్రైమర ఎడ్యుకేషన్‌, నర్సరీ స్కూల్‌ ఆర్గనైజేషన్‌, కమ్యూనిటీ,చైల్డ్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్‌ ఉన్నత ప్రామిక విద్య (అప్పర్‌ ప్రైమరీ ఎడ్యుకేషన్‌) అని రెండు విభాగాలుంటాయి. 1 నుంచి 5వ తరగతులు ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్యావిభాగంలోకి వస్తాయి. పిల్లల వయసు సాధారణంగా 5 నుంచి 10 ఏళ్లలోపు ఉంటుంది.

అర్హత:

ప్రాథమిక పాఠశాల టీచర్‌గా పనిచేయాలనుకునే వారికి కనీస విద్యార్హతగా 10+2/ఇంటర్‌ 50శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు డిఇడి పూర్తి చేసుండాలి. అలాగే చీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టిఇటి)లో అర్హత సాధించాలి. టిఇటిను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) నిర్వహిస్తుంది. అలాగే కొన్ని రాష్ట్రాలు స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. సి-టెట్‌లో అర్హత సాధించిన వారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హులు. ఒక్కసారి టిఇటిలో అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు పనిచేస్తుంది.

అలాగే టిఇటిని అర్హత సాధించే వరకు ఎన్నిసార్లయినా రాయొచ్చు. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మెరుగైన స్కోర్‌ కోసం మళ్లీ మళ్లీ రాసుకునే వెసులుబాటు ఉంది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాల విద్య లేదా హైస్కూల్‌ విభాగంలోకి వస్తాయి. పిల్లల వయసు 11-15 ఏళ్లుగా ఉంటుంది. హైస్కూల్‌ విభాగంలో ఇంగ్లిష్‌, హిందీ, సోషల్‌, మ్యాథమెటిక్స్‌, తెలుగు, సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ వంటి సబ్జెక్టులు ప్రధానంగా ఉంటాయి.

ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకు సంబంధించి ప్రణాళికలు రూపొందించడం, సబ్జెక్టులను విద్యార్థులకు పరిచయం చేయడం, తద్వారా విద్యార్థి సామర్థ్యాలు, లక్ష్యాలను ఏర్పరచుకునే విధంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత, ప్రైమరీ విద్య ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో, తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో అందుబాటులో ఉంటుంది. 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.డిఇడి, బిఇడి వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ప్రైవేట్‌ రంగంలోని స్కూల్స్‌లో అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. టెట్‌, సీసెట్‌ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా స్కూల్‌ టీచర్‌గా ఉజ్వల కెరీర్‌కు మార్గం ఏర్పడుతుంది. ఇంగ్లిష్‌లో బోధనపై పట్టున్న వారికి అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/