8వ తరగతి బాలికపై టీచర్ కాల్పులు

Teacher fires at 8th grade girl

kanpur: పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 8వ తరగతి బాలికపై ఉపాధ్యాయుడు జరిపిన కాల్పుల్లో ఆ బాలిక మరణించింది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. ప్రభఉత్వ పాఠశాలలో పని చేస్తున్న శైలేంద్ర రాజ్ పుత్ అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు శైలేంద్ర రాజ్ పుత్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆ బాలికపై పగ పెంచుకున్న శైలేంద్ర రాజ్ పుత్ ఈ రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న బాలికపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన శైలేంద్ర రాజ్ పుత్ పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/