పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి

పిల్లలకు మంచి  అలవాట్లు నేర్పాలి

పిల్లలు చాలా విషయాల్ని పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకుంటారు. అందుచేత తల్లిదండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపి అభివృద్ధి చేయాలి. పాలు తాగేటప్పుడు ఏదైనా తినేటప్పుడు ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు. అతిధుల ముందు ఎలా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్‌ పైన గాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి. స్వీట్స్‌, ఐస్‌క్రీమ్స్‌ పిల్లలకు ఎంతో ఇష్టం. కాఇ అవి వారి ఆరోగ్యానికి మంచివి కావ్ఞ. ఏ సీజన్‌లో దొరికే పళ్లు సీజన్‌లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయాలి. పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలి తినాలి. పాలను కూడా నెమ్మదిగా తాగాలి. పిల్లలు ఒక్కోసారి అల్లరి చేస్తారు పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టకూడదు. కారణమేదో తెలుసుకుని వారిని మెల్లిగా మందలించాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నామని వారిపై కోపాన్ని ప్రదర్శించకూడదు. దానివల్ల లాభం కంటే నష్టమ ఎక్కువ. ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురుపిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు అనునయిస్తూ మధ్య స్నేహం ఉండేలాచూడాలి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/