ఆకర్ష్‌-2: సైకిల్‌ ఎక్కనున్న హేమాహేమీలు

TDP
TDP

ఆకర్ష్‌-2: సైకిల్‌ ఎక్కనున్న హేమాహేమీలు

 

వైకాపాకు చెక్‌ పెట్టేందుకు వ్యూహం

పవన్‌లో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా చర్యలు

అమరావతి,µ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి 2019ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా పెట్టుకొని ఆకర్ష్‌-2 చర్యలు మొదలుపెట్టింది.కాంగ్రెస్‌ పార్టీతోపాటు ప్రతిపక్షాల్లోనున్న హేమాహేమీలను టిడిపిలోనికి రప్పించడానికి ఆపార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.అలాగే వైసీపీ సంబందితనేతలను తమ పార్టీలోనికి రప్పించుకోవడానికి చర్చలు జరిపినా సంబంధిత నేతలు వైసీపీకి కంటే టిడిపిలోనే గుర్తింపు ఉంటుందని భావిస్తోన్నారు.రాష్ట్ర విభజన అనంతరం 2014ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఫలితాలు తుడిచిపెట్టుకు పోయాయి.కొంత మందినేతలు 2014ఎన్నికల బరిలోకి దిగలేదు.2019 ఎన్నికల నాటికి బిజేపిపై తీవ్ర వ్యతిరేక పవనాలుంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తోన్నాఉ.కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 2018ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోనికి వస్తోందని ఏపి ప్రత్యేకహోదా తెస్తామని పదేపదే చెప్పడం,ఎఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ కూడా ఇప్పటికే ప్రకటించారు.ఒకవేళ కేంద్రంలో అధికారంలోనికి వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనేది జగమెరిగిన సత్యం.దీంతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు టిడిపి వైపే చూపుపెట్టినట్లు తెలిసింది.ఇక జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది 2019ఎన్నికల్లో టిక్కెట్‌ లభించదని తెలుసుకొన్న ఎమ్మెల్యేలు,వైసీపీ నుండి వలసవచ్చిన ఎమ్మెల్యేలు టిడిపి టిక్కెట్‌ లభించదని తెలిసినా దాదాపు 30మంది ఎమ్మెల్యేలు పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు టిడిపి అధిష్తానం పనికట్టిన్నట్లు తెలిసింది.దీంతో టిడిపి అధిష్ఠానం ముందస్తుచర్యలు చేపట్టి ఆ 30మందికి ప్రత్యామ్నాయంగా అభ్యర్థుల ఎంపికకు వడపోత పోస్తున్నటుఓల తెలిసింది.

వీరిలో కొంతమంది ఎమ్మెల్యేలు పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో అధికారంలోనికి రాకపోతే తమ రాజకీయ భవిష్యత్‌ ఏంటని టిడిపిలోనే కొనసాగేందుకు టిడిపి అధిష్టానంతో కలసి వివరణ ఇచ్చుకొంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఆకర్ష్‌-2లో ఇప్పటికే కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసిం హారెడ్డి,రాజం మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి కొండ్రు మురళీలు టిడిపిలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకొన్నారు.అలాగే విశాఖపట్నం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ,అదేజిల్లా మరోనేత సబ్బంహరి,తూర్పుగోదావరి జిల్లా సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌,కడపజిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జి.ద్వారకానాధ్‌రెడ్డి,కర్నూల్‌,చిత్తూరు,అనంతపురం జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు,మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్సీలు టిడిపిలో అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.

టిడిపి ప్రభుత్వం ఏపికే ప్రత్యేకహోదా,విభజన చట్టం హామీలు అమలుపై సీఎం బాబు కేంద్రంపై ఢీ అంటే ఢీ అని పోరాటం చేస్తున్న తరుణంలో బాబు ధైర్య సాహాసాలను గమనిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు 2019లో టిడిపినే అధికారంలోనికి రాగలదనే ధీమాతో టిడిపిలో చేరడమే రాజకీయంగా శ్రేయస్కరమని సైకిళ్ళెక్కనున్నట్లు తెలుస్తోంది.టిడిపి అధిష్టానం కేంద్రంపై చేస్తున్న ధర్మపోరాటం,వివిధ పధకాలు,అభివృద్ధి కార్యక్రమాల ద్వారా టిడిపికి ప్రజల్లో ఆదరణ ఉండడంతో రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ నేతలు టిడిపిలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో టిడిపి ఆకర్ష్‌ ఆపరేషన్‌ కూడా వేగం పుంజుకొంది.సీఎం బాబు కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

బాబు జ్ఞానభేరి,వనం-మనం,ధర్మపోరాటం తరహాలో వివిధ సభలు,సమావేశాలు నిర్వహిస్తుండడంతో ప్రతిపక్షాలు కేవలం బాబుపై విమర్శలకే పరిమితమైయ్యారు.బాబు ప్రతిపక్షాల ఆరోపణలను టేకిట్‌ ఈజీగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా వారంలో పలుమార్లు పర్యటనలు చేస్తూ ప్రజల్లోనికి కేంద్రం చేసిన కుట్ర వివరించడం రాష్ట్రంలో వైసీపీ,బిజేపి,జనసేన,వామపక్షాలు అనుసరిస్తున్న విధివిధానాలపై,ఏపికే ప్రత్యేకహోదా,విభజన చట్టం హామీలపూ తాము పోరాటం చేస్తోంటే తమపై ఎదురుదాడికి దిగుతున్నారనేది ప్రజలు టిడిపి వివరిస్తుండడంతో ప్రజలు కూడా టిడిపి వెంటే ఉంటూ మద్దతిస్తున్నారు.అయితే కేంద్రం చేయాల్సిన చట్టాలను మరచి ప్రతిపక్షాలు టిడిపిపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవని గుర్తించారు.ప్రత్యేకించి బిజేపి తరపున బిజేపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్‌ నరసింహారావు రాష్ట్రప్రభుత్వంపై చేస్తున్న విమర్శళకు టిడిపి నేతలు చేస్తున్న సవాల్‌కు బిజేపి నేతలు జవాబు చెప్పే పరిస్థితుల్లేవు.బాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తన భుజస్కందాలపై పనులు వేసుకొని చేస్తున్న కేంద్రం నిర్మాణంలో మోకాలడ్డుతుండడం,రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఏటా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన రూ.50కోట్లు విడుదల,రెవెన్యూ లోటుభర్తీ చేయడంలో కేంద్రం విఫలం కావడం,రాష్ట్ర రాజధాని నిర్మాణంలో నిధుల విడుదల్లో తీవ్ర జాప్యంతో ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు గ్రహించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న విమర్శలపై ప్రజలే నమ్మే పరిస్థితులు లేకపోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు,చివరికి పలువురు బిజేపి నేతలు టిడిపిలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.దీంతో టిడిపి ఆకర్ష్‌-2 ద్వారా టిడిపిలోనికి రావడానికి అన్నీపార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు క్యూ కడుతున్నట్లు తెలిసింది.