స్థానిక ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి

lokesh
lokesh

అమరావతి: రాజధాని నిర్మాణంలో కుంభకోణాలున్నాయంటూ సియం జగన్‌ వ్యాఖ్యానించడం వల్ల పెట్టుబడిదారులంతా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముందని టిడిపి నేత లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని, అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేసిందని అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజావేదిక కూల్చివేతపై ఉన్న శ్రద్ధ జగన్‌కు విత్తనాల పంపిణీలో లేదన్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టిడిపిపై బురదచల్లుతున్నారని లోకేశ్‌ ఆక్షేపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుంజుకోవాలని లోకేశ్‌ పార్టీ నేతలకు సూచించారు. త్వరలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని కార్యకర్తలకు తెలిపారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/