గేట్లెక్కి నామినేషన్‌ వేసిన మహిళా అభ్యర్థులు

MPTC female candidate
MPTC female candidate

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గేట్లు ఎక్కి మరీ నామినేషన్లు వేసిన ఫోటోలను టిడిపి అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. వైఎస్‌ఆర్‌సిపి మంత్రి పెదిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో టిడిపి అభ్యర్థుల దుస్థితి ఇది అంటూ ట్వీట్‌ చేసింది. పోలీసులు టిడిపి అభ్యర్థులను నామినేషన్‌ వేసేందుకు అనుమతించకపోవడంతో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు గేట్లెక్కి లోని వెళ్లిన ఫోటోలను టిడిపి పోస్టు చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/