నేడు బిజెపిలో చేరునున్న టిడిపి నేతలు

bjp, tdp
bjp, tdp

హైదరాబాద్‌: బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఢిల్లిలో ఈరోజు తెలంగాణ టిడిపి నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్దన్‌ బిజెపిలో చేరునున్నారు. వీరితోపాటు మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత శశిధర్‌రెడ్డి కూడా బిజెపిలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నలుగురు చేరిక నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నేడు ఢిల్లికి వెళ్లనున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/