జగన్‌కు రేపు అభినందన లేఖను ఇవ్వనున్న టిడిపి బృందం

ganta, acchenaidu, payyavula
ganta, acchenaidu, payyavula

అమరావతి: ఏపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు టిడిపి బృందం ఆయన నివాసానికి రానుంది. టిడిపి నేతలు పయ్యావుల కేశవ్‌, గంటా శ్రీనివాస్‌, అచ్చెన్నాయుడు ఆయనను కలిసి టిడిపి అధినేత చంద్రబాబు తరఫున అభినందన లేఖను జగన్‌కు అందజేస్తారు.
ఉదయం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో జగన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత చూపగా, పార్టీ వర్గాలు వద్దని వారించినట్లు సమాచారం. రాజ్‌ భవన్‌ వంటి వేదికల వద్ద ప్రమాణం ఐతే వెళ్లొచ్చని..కాని బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు వెళ్లడం సరికాదని పలువురు నేతలు సూచించగా, చంద్రబాబు వెనక్కు తగ్గారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/