టీడీపీకి రైతుల ప్రయోజనాలే ముఖ్యం

భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమరావతి : ఈ నెల 27న రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ కు ఇప్పటికే పలు పార్టీలు మద్దతు పలికాయి. తాజాగా టీడీపీ కూడా బంద్ కు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించింది. రైతు సంఘాల బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

రైతుల ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని చెప్పారు. ఈ బంద్ లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 27న భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై అచ్చెన్న విమర్శలు గుప్పించారు. సచివాలయాలను సందర్శిస్తానన్న జగన్ కు దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని సవాల్ విసిరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/