సగానికి పైగా తగ్గనున్న టిడిపి బలం?!
చంద్రబాబుకు మరో దెబ్బ!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ప్రతిపక్ష హోదా హుళక్కి?
తెలంగాణలో కాంగ్రెస్‌కు జరిగిన నష్టమే.. ఎపిలో టిడిపికి!?

హైదరాబాద్- అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థి తులు అధికార పార్టీకి ఎంతగా కలిసివస్తున్నాయో..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో తెలుగు దేశం పార్టీని మరింత బలహీనంచేసేందుకు పరోక్షంగా ప్రయత్నాలు ప్రారంభిం చారా? ఆపరేషన్ ఆకర్ష్‌కు జగన్‌కూడా తెరలేపితే ఎపిలో టిడిపి శాసన సభ్యులు మిగిలేది ఎందరు? వైసిపిలో చేరేది ఎందరనే చర్చ జరుగుతున్నది.
జగన్ విధానాలపై టిడిపి ఎంఎల్ఎలు ఇతర నేతలు బహిరంగంగా స్వాగతం పలుకుతున్నారు. మూడు రాజధానిలపై అసెంబీల్లలో ముఖ్యమంత్రి జగన్‌చేసిన ప్రకటనను విశాఖ పట్టణంలో ఒక నేత, కర్నూలు జిల్లాలో మరో నేత ఆ నిర్ణయాన్ని అభినందించారు. పార్టీ నేతలు ఎంఎల్ఎలుకూడా ఇదే అవకాశంగా వైఎస్‌ఆర్‌సిలో చేరేం దుకు ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి పదిమంది అధికార పార్టీలో చేరేం దుకు సంసిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
వారిలో కొందరు ఇప్పటికే మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో చురుకుగా పాలుపంచుకోకుండా వైఎస్‌ఆర్‌సికి పరోక్ష సంకేతాలిచ్చారని భావి స్తున్నారు. టిడిపికి వారు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరితో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష హోదాను కోల్పోక తప్పదని అంటున్నారు.
తెలంగాణలో అధికార పార్టీ ఆకర్షణతో పెద్దయెత్తున వలసలు పెరిగిన విషయం తెలిసిందే.. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అనాథగా మారి పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతిని వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడం, తెలం గాణ తోపాటు ఎపిలోనూ సమర్థవంతమైన నాయకత్వం కొరవడం వల్లకాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతున్నది. ఎపిలో ఇప్పటికే అనేకమంది సీనియర్ నేతలు వైఎస్ఆర్సి పార్టీలో చేరిపోయారు.
కాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు క్షీణించిపోతుండగా అధికార పార్టీ ప్రభావంతో అనేక మంది నేతలు ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ తీర్థం పుచుకుంటున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలహీనం కావడం వల్ల అధికార పార్టీకి ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఎపి సిఎం జగన్ కూడా పరిస్థితి అవగాహనలోకి రాలేదని చెప్పలేం.
అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత పిరాయింపులను ప్రోత్సహించేది లేదని, ఏ ఎంఎల్ఎ అయినా.. టిడిపి నుంచి వైఎస్‌ఆర్‌సిలో చేరాలంటేపదవికి రాజీనామా చేయాలని షరతు విధించడంతో పలువురు తటపటాయించారు. కానీ ఇటీవలి కాలంలో ఎపి అధికారపార్టీలోనూ మార్పు కనిపిస్తున్నది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సిలో చేరిన వారు రాజీనామాచేయాల్సిన అవసరం లేదని , సభలో వారిని అన్అటాచ్డ్ సభ్యునిగా కొనసాగేలా అవకాశం కల్పించవచ్చని కొత్త ప్రయోగాన్ని ఇప్పటికే జగన్ అమలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన శాసనసభ్యుడు(గన్నవరం) వల్లభనేని వంశి.. వైఎస్ఆర్సి లో నేరుగా చేరకుండా ఈ విధంగా కొనసాగుతున్నందున ఇది ఇతర టిడిపి సభ్యులకు మార్గదర్శకమవుతున్నది.
ఇదే తరహాలో అధకార పార్టీలో చేరేందుకు ఇతర టిడిపి సభ్యులకు జగన్ క్లియరెన్స్ ఇస్తే కనీసం పది మంది వైఎస్ఆర్సిలోకి దూకడం ఖాయమని ఇటీవలి ఎపి అసెంబ్లీ పనితీరును పరిశీలిస్తే సులువుగానే బోధపడుతున్నది. చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధానిపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా టిడిపి సభ్యులు కేవలం తొమ్మిది మంది మాత్రమే సస్పెన్షన్‌కు గురయ్యారు. టిడిపి దృష్టిలో ఈ చర్చ ఎంతో కీలకం.
కానీ ఆ సమయంలో హాజరైన సభ్యులు ఇంతగా తగ్గిపోవడానికి కారణం జగన్ ఆకర్ష్ మంత్రం లేదా భవిష్యత్తు రాజకీయాలపై ఆశ తప్ప ఇతర కారణాలు కనిపించవు. మరో నాలున్నర సంవత్సరాలు చంద్రబాబు పక్కన ఉంటే వచ్చే ప్రయోజనం కంటే జగన్ వెంట వెలితే లభించే లాభనష్టాలను వారు బేరీజు వేసుకుని ఉంటారు. టిడిపి సభ్యుల బలం సభలో 23 కాగా ఏ రోజూ అందరూ అసెంబ్లీ కివచ్చినట్లుగా లేదు. కనీసం పది మంది సభ్యులు ఈ సభ చర్చల్లో పాలుపంచుకోవడంలో కనీస ఆసక్తిని కనబర్చలేదనేది బహిరంగ రహస్యమే.

ఇదంతా చంద్రబాబుకు స్పష్టంగా తెలిసినా అటు పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఇటు శాసనసభలో టిడిపి నేతగా..ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నప్పటికీ తనంతతానుగా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. రాజ్యసభలో పార్టీ పక్షం బిజెపిలో విలీనం అయినట్లుగానే ఎపిలోనూ శాసనసభలో టిడిపి విలీనం కాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా అధికార టిఆర్ఎస్లో విలీనం కావడంతో తెలంగాణలో కాంగ్రెస్ భవష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి నాయకత్వమే లేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో టిడిపి ఉనికి లేని స్థితిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ కొట్టడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విజయవంతంగా చర్యలు తీసుకున్నారు. దీంతో తర్వాతి ఎన్నికల్లోనూ, రాజకీయ కార్యకలాపాల విషయంలోనూ అంతా ఏకపక్షంగానే సాగుతూ, ముఖ్యమంత్రి నిర్ణయాలను కనీసం ప్రశ్నించే వారు లేని పరిస్థితి ఏర్పడింది.
ఈమేరకు ఆర్టీసీ, సమ్మె కాని, మద్యం ధరల పెంపుదల వంటి అంశాల్లో ప్రతిపక్షాల గొంతుకు విలువలేకుండా పోయింది. సోదర తెలుగు రాష్ట్రంలో కెసిఆర్‌కు కలిసివస్తున్న ఈ ధోరణి ఎపి సిఎం జగన్‌కు కూడా తెలియనది కాదు. అందుకే టిడిపిని ఎపిలో కూడా మరింత బలహీన పర్చేందుకు పిరాయింపులను నిరోధించే చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఇదే జరిగితే చంద్రబాబు మరింత ఢీలా పడే ప్రమాదర పొంచి ఉంది.
అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం పది శాతంకు పైగా బలం ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది సభ్యులన్నారు. అంటే కనీసం 18 మంది సభ్యుల బలం కంటే ఎక్కువగా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టిడిపి నుంచి 23 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో అయిదారుగురు పార్టీ నుంచి పిరాయిస్తే సభలో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/