నేడు టిడిపి తొలి జాబితా విడుదల
అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల బరిలోకి దిగాలని నిర్ణయం

హైదరాబాద్: నగరంలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో టిడిపి మళ్లీ పుంజుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్‌లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎల్.రమణ తెలిపారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేస్తామన్నారు. అలాగే, రాత్రికి రెండో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సమావేశానికి రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ టిడిపి ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి అన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/