సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద టిడిపి నేతల ఆందోళన

కక్షసాధింపే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపాటు

TDP-Protest
TDP-Protest

అమరావతి: టిడిపి నేతలు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టగా చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఏపి అన్నింటా వెనుకబడిపోయిందని, రాజకీయ కక్ష సాధింపు విధానాలే ప్రధాన అజెండాగా రాష్ట్ర పరిపాలన సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. సిఎం జగన్ తమపై దాడులు చేయిస్తూ సంతోషపడుతున్నారని విమర్శించారు. పరిపాలన వదిలేసి తమపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారని, రివర్స్ పాలన కారణంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. పాలనలో సలహాదారులే చక్రం తిప్పుతున్నారని, వారికి ముడుపులు ముడితేనే ఏ పథకమైనా ముందుకు వెళుతుందని ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/