రాష్ట్రవ్యాప్తంగా కోడెల సంతాప సభలు

GunturL ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కోడెల సంతాప సభలు నర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులను ఖండించాలన్నారు. కోడెల కుటుంబంపై అనేక కేసులు పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అవమానాలు కోడెల తట్టుకోలేకపోయారన్నారు. వేధింపులు తట్టుకోలేకే కోడెల బలవన్మరణం చెందారన్నారు. కోడెల మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పోయానన్నారు.