రాష్ట్రంలో నివసించేహక్కు మాకు లేదా ?

Amaravati: తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. మా నాయకులను ఇంటికి రానీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అచ్చెన్నాయుడిని పోలీస్ స్టేషన్లు మారుస్తూ వచ్చారన్నారు. శిబినంలో ఉన్న వారికి భోజనం కూడా లేకుండా చేశారన్నారు.
ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా ?
ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే అడ్డుకుంటున్నారని అన్నారు. తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను గృహ నిర్బంధం చేశారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తనను ఇంట్లో నిర్బంధించారన్నారు.