మరోసారి బాబు నివాసంలో భేటి కానున్న టిడిపి నేతలు

TDP
TDP

అమరావతి: టిడిపి అధినేత, చంద్రబాబు నివాసంలో మరోసారి టిడిపి నేతలు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సీనియర్‌ నాయకులంతా సమావేశం కానున్నారు. ఈ సమేవేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్టీ వలసలపై చర్చించడంతో పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందించనున్నారు. ఇదిలా ఉంటే యూరప్‌లో ఉన్న చంద్రబాబు శుక్రవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ మాట్లాడారు. ఎంపిలు పార్టీ మారడం ఫిరాయింపు చర్యేనని వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/