లోకేశ్‌ కాన్వాయ్ లో పోలీసుల తనిఖీలు

కోడ్ కారణంగానే తనిఖీలు చేశామన్న అధికారులు

LOKESH-
LOKESH-

హైదరాబాద్‌: టిడిపి నేత నారా లోకేశ్‌ కాన్వాయ్ ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో తన నివాసం నుంచి విజయవాడకు ఆయన బయలుదేరగా, కాన్వాయ్ గేటు దాటగానే పోలీసులు ఆపారు. ఆపై అన్ని వాహనాలనూ తనిఖీ చేసి పంపారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుండటం, కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలోనే తనిఖీలు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. తనిఖీల అనంతరం లోకేశ్ కాన్వాయ్ విజయవాడకు బయలుదేరి వెళ్లింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/