వైఎస్‌ఆర్‌సిపి అరాచకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలి

ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చేశారు..లోకేశ్

అమరావతి: సిఎం జగన్‌ ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చేశారని టిడిపి నేత లోకేశ్‌ మండిపడ్డారు. జనాన్ని ఓటు వేయనివ్వడం లేదని విమర్శించారు. ఓటేసే వాళ్లపై వేటేసే కేటుగాడు జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపికి మద్దతుగా నిలిచారనే కక్షతో తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు, వాలంటీర్ పెట్టిన హింసతో దంపతులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని… ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి సాగిస్తున్న అరాచకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలని అన్నారు.

151 సీట్లను గెలుచుకుని, సంతలో పశువులను కొన్నట్టుగా మరో నలుగురిని కలుపుకున్నా ఎన్నికల్లో పోటీకి ఎందుకు భయపడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ‘తాడేపల్లి కొంపలోంచి బయటకు రావాలంటే వలలు, పోలీసులు అడ్డం ఉండాలి నీకు. మళ్లీ ఢిల్లీని ఢీకొడతాడు, మోడి  మెడలు వంచుతాడు, గాంధీ మళ్లీ పుట్టాడంటూ ఎలివేషన్లు’ అని దుయ్యబట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/