రాష్ట్రపతిని కలిసిన టిడిపి ఎంపిల బృందం

వేధింపులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్రపతికి నివేదన

TDP MPs meets president Ram Nath Kovind

న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను టిడిపి ఎంపిల బృందం కలిశారు. ఏపిలో గత 13 నెలలుగా నెలకొన్న దౌర్జన్యకర వాతావరణం, రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరిం చారు. తప్పుడు పాలన, అవినీతి, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కడం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై కత్తెర, విపక్ష నేతలను తీవ్రస్థాయిలో వేధించడం వంటి అంశాలను టిడిపి ఎంపి లు రాష్ట్రపతికి నివేదించారు.
అనంతరం రామ్మోన్ నాయుడు మాట్లాడుతూ టిడిపి నేతలపై కక్షపూరితంగా దాడులు చేయడం, రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావధానంగా విన్నారని, తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు టిడిపి ఎంపి వెల్లడించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/