రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు (గతంలో ఈనాడు రిపోర్టర్) కోరికతో విగ్రహం తయారుచేస్తున్నట్లు కోనసీమ జిల్లా కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజకుమార్ వుడయార్ తెలిపారు. రామోజీరావు గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ‘ఈనాడు’ ప్రారంభమైన విశాఖపట్నంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని అప్పలనాయుడు తెలిపారు.

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) వారం రోజుల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాల తో ఆయన అంత్యక్రియలు జరిపారు.