మండలిపై సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం

ముఖ్యమంత్రి జగన్‌కు సభా హక్కుల నోటీసులు ఇస్తాం

ashok babu
ashok babu

అమరావతి: మండలిని కించపరిచేలా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరించారని టిడిపి ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వచ్చే శాసన మండలి సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు. మంగళగిరిలోని టిడిపి కార్యలయంలో ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ, బీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. అడ్డదారిన ఎమ్మెల్సీలుగా వచ్చారన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై సభాహక్కుల నోటీసులు ఇస్తామని వారు వివరించారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు ఉన్న మండలిపై సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. త్వరలో టిడిపి పార్టీ ఎమ్మెల్సీలమంతా ఢిల్లీ వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. మండలి రద్దు వెనక రాజకీయ కారణాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/