అప్పుడే వాటాల బాగోతం మొదలు

వైఎస్‌ఆర్‌సిపిపై విపక్షాల విమర్శలు

rajendra prasad
rajendra prasad

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో వాటాల బాగోతం మొదలైందని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఇసుక కోసం వైఎస్‌ఆర్‌సిపికి చెందిన బాపట్ల ఎంపి నందిగం సురేశ్‌, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. మంత్రి అనిల్‌ యాదవ్‌ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్‌ హితవు పలికారు. మండలిలో విధివిధానాలు లేకుండా మంత్రులు వ్యవహరిస్తున్నారని బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఒక మంత్రికి క్యూసెక్కుకు, టిఎంసికి తేడా తెలియని వ్యక్తి జలవనరుల శాఖమంత్రి అంటూ అనిల్‌ యాదవ్‌ను ఉద్దేశించి బచ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. ప్రశ్నలు అడుగుతున్న వారినే వైఎస్‌ఆర్‌సిపి నేతలు దూషిస్తున్నారని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/