వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు టిడిపి ఎమ్మెల్సీ

Vivekananda Reddy
Vivekananda Reddy

కడప: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇటీవలే విపక్షాలు ఈ కేసుపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి సిట్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తుంది, అయినా ఇప్పటి వరకు అధికారులు విచారణను పూర్తిస్థాయిలో జరపలేకపోయారు. గత నాలుగు రోజులుగా సిట్‌ అధికారులు ప్రణాళికాబద్దంగా కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారిస్తున్నారు. కాగా ఈ విచారణలో భాగంగా నేడు విచారణకు టిడిపి ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/