మండలి రద్దు నిర్ణయంపై లోకేశ్‌ తీవ్ర విమర్శలు

సిఎం జగన్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో స్పందిచారు.
అక్రమాస్తుల కేసులో జగన్ కి కోర్టు మిన‌హాయింపు ద‌క్క‌లేదు. కోర్టుల‌ను ర‌ద్దు చేస్తారా? లేదా ప్ర‌తీ శుక్ర‌వారం వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని శుక్ర‌వారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా? అని ట్వీట్ చేశారు. అసలు తాము శాసనమండలిలో ఏ బిల్లును కూడా అడ్డుకోలేదని, కేవలం సవరణలు మాత్రమే కోరామని లోకేష్ చెప్పారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు. ఇప్పటి వరకూ మండలిలో ఒక్క బిల్లుని కూడా తిరస్కరించలేదు. కొన్ని బిల్లులకు సవరణలు అడిగాం.గ అని మరో ట్వీట్ చేశారు. కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ గారు ఎందుకు వణికిపోతున్నారు? మండలి రద్దుతోనే మూడు ముక్కలాట ప్రజలు కోరుకున్నది కాదు. ఆయన స్వార్ధ నిర్ణయం అని స్వయంగా జగన్ ఒప్పుకున్నారు.గ అని లోకేష్ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/