పేటీఎమ్‌ బ్యాచ్‌ ఆవేశం చూస్తే నవ్వొస్తుంది

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుమారుడు రిత్విక్‌ నిశ్చితార్థంపై రాజకీయ దుమారం చేలరేగుతుంది. దుబాయ్ లో జరుగుతున్న ఈ వేడుకకు టిడిపి నేత నారాలోకేష్‌ వెళ్లారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నావారికి నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి పేటీఎం బ్యాచ్‌ ఆవేశం చూస్తుంటే నవ్వొస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేష్‌ మండిపడ్డారు. అకౌంట్లో జగన్‌ గారి చిల్లర పడితే చాలు ఇంగీతజ్ఞానం కూడా మార్చిపోయి రెచ్చిపోతున్నారని విమర్శించారు. సీఎం రమేష్‌ గారి పెళ్లికి దుబాయ్  వెళ్లాడంటూ.. ఎప్పుడో అమెరికా వెళ్లినప్పటి పాత ఫోటోలు పోస్టు చేసి కొత్త కథ అల్లారని మండిపడ్డారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై లోకేష్‌ జాలి పడ్డారు. సోషల్‌ మీడియాలో మీరు ఒక పోస్టు చేస్తే ఇంకా ఐదు రూపాయలే ఇస్తున్నారంట కదా! కాస్త ఎక్కువ అడగండి స్వామీ జేట్యాక్స్‌ పేరుతో కోట్లు వసూలు చేసుకుంటున్నారు. మీకు మాత్రం ఐదు రుపాయలేనా అని ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/