ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది

మండలి బిల్లును అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ అహం దెబ్బతింది

buddha venkanna
buddha venkanna

విజయవాడ: పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షంపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ అహం దెబ్బతిని మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మండలిని రద్దు చేసే ముందు వైఎస్సార్‌సిపి నుంచి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు పొందిన ఇద్దరితో రాజీనామా చేయించాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌ చేశారు. కాగా మండలి రద్దు చేయడాన్ని నిరసిస్తూ టిడిపి పార్టీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు చేపట్టిన బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. బుద్దా వెంకన్న ఇంటికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులతో పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/