మండలి ఛైర్మన్‌కు టిడిపి లేఖ

ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాలు ఉండాలన్న టిడిపి ఎమ్మెల్సీలు

tdp-mahanadu

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ కు టిడిపి శాసనమండలి సభ్యులు లేఖ రాశారు. సభ్యుల హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… సభ్యుల హక్కులను కాపాడాలని లేఖలో కోరారు. సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు టిడిపి మండలి సభ్యులు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మంతెన వెంకట సత్యనారాయణరాజు తదితరులు ఛైర్మన్ కు లేఖ రాశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/