పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు

మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

gorantla buchaiah chowdary
gorantla buchaiah chowdary

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టిడిపి సినీయర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు విమర్శలు చేశారు. రాజమహేంద్రవరంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిది నెలలకే భ్రష్టుపట్టిపోయిన ప్రభుత్వం వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో వెస్సార్‌సిపి వాళ్లు బూతులు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టారా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో మైనార్టీ నాయకుడిపై అధికార పార్టీ నేతల వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నడవడం లేదని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని అమరావతి తరలింపు అనేది కేవలం 29 గ్రామాల ప్రజలకు సంబంధించిన సమస్య కాదని, ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/