టిడిపి సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం

సభలో టిడిపి సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు

cm jagan mohan reddy
cm jagan mohan reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో టిడిపి సభ్యుల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ టిడిపి సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టిడిపి సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. టిడిపి సభ్యులకు సభలో మాట్లాడటం చేతకాకపోతే సభ బయటే ఉండాలని సీఎం సూచించారు. సభ్యుల తీరుతో సభ నడిచే అవకాశం లేకుండాపోతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పొడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌్‌ను రంగంలోకి దింపండని స్పీకర్‌కు సీఎం సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/