మోది ఆగడాలకు నిరసనగా కాగడాల ప్రదర్శన

ఉగాదికి టిడిపి మేనిఫెస్టో
7న సర్వమత ప్రార్ధనలు
8, 9 తేదీల్లో వీరతిలకంతో ప్రజల్లో స్పూర్తి

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm

అమరావతి: ఏపిలోని టిడిపి వారిపై కేంద్ర వ్యవస్థలతో మోది దాడులు చేయిస్తున్నారని ఏపి సియం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని, వీరికి ప్రజలు ఓటుతోనే బుద్దిచెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగాది సందర్భంగా టిడిపి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఈ రోజు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా తెలిపారు. పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్ఫూర్తితో, తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శన సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్ధనలు, పూజలు నిర్వహించాలని, కుట్రలపై సర్వమతాలు తమకు అండగా నిలుస్తాయని సియం ఆకాంక్షించారు. జగన్‌ తమతోనే ఉంటాడన్న బిజెపి నేతలు చెప్పడం ముస్లిం మైనార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచిందని సియం అన్నారు. 8,9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిలింపచేయాలని సియం సూచించారు. క్యారెక్టర్‌ లేని వారంతా వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉన్నారని, వైఎస్‌ఆర్‌సిపిని ఎదుర్కొంటూనే ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ముందుకు సాగాలని నేతలకు సూచించారు. పొలవరం అడ్డుకునేందుకు న్యాయస్థానంలో కేసులు వేశారని వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సియం చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/