హిందూపురంలో టిడిపి నేతల ఆందోళన
ఏపిలో విద్యుత్ చార్టీల పెంపుపై నిరసన

అనంతపురం: ఏపి విద్యుత్ చార్టీల పెంపుపై టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే జిల్లాలోని హిందూపురంలో టిడిపి నేతలు ఈరోజు నిరసనకు దిగారు. ట్రాన్స్కో డీఈ కార్యలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. పెంచిన బిల్లలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని టిడిపి నేత హెచ్చరించారు.
జా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/