ఎంపీ మాధవ్ వ్యవహారం..వీడియోపై కేసు నమోదు కాలేదుః వర్ల

వీడియోను ఏ ల్యాబ్ కు పంపలేదని ఆరోపణ

varla ramaiah
varla ramaiah

అమరావతిః టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై స్పందించారు. ఎంపీ మాధవ్ బూతు వ్యవహారంపై ఇంతవరకు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లోనూ కేసు రిజిస్టర్ చేయలేదు, దర్యాప్తు చేపట్టలేదు అంటూ ఆరోపించారు. ఆ బూతు వీడియోను ఇంతవరకు ఏ ల్యాబ్ కు పరీక్ష నిమిత్తం పంపలేదని రామయ్య పేర్కొన్నారు. “ఓవైపు రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. మరి మహిళా మంత్రి ఉషశ్రీ గారేమో ఇంకెక్కడి కేసు అంటున్నారేంటి?” అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా ఇదే అంశంపై కాస్త ఘాటుగా స్పందించారు. గత కొద్దిరోజులుగా కామపిశాచి ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం మొదలుకుని, వ్యవస్థలను మేనేజ్ చేసేవరకు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. ఆ ప్రయత్నాలను పటాపంచలు చేస్తూ సంచలన ఫోరెన్సిక్ రిపోర్ట్ తో మీడియా ముందుకు వస్తానని పట్టాభిరామ్ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/