ఏపి డీజీపీని కలిసిన టిడిపి నేతలు

tdp
tdp

అమరావతి: ఏపి డీజీపీ గౌతం సవాంగ్‌ను ఈరోజు టిడిపి నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో టిడిపి నేతలపై జరుగుతున్న దాడులపై వారు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకూ తమ కార్యకర్తలపై 140 దాడులు జరిగాయని.. ఆరుగురు హత్యకు గురయ్యారని నేతలు డీజీపీకి వివరించారు. వీటిలో 80 భౌతిక దాడులు ఉన్నాయని వివరాలను అందించారు. 54 చోట్ల ఆస్తుల విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని అన్నారు. డీజీపీని కలిసినవారిలో మాజీ మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి, నేతలు రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య, కరణం బలరాం, జూపూడి ప్రభాకర్, పంచుమర్తి అనురాధ తదితరులు ఉన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/