టిడిపి నేతల హౌస్‌ అరెస్టు


ఎక్కడి వారిని అక్కడే నిర్బంధిస్తున్న పోలీసులు

tdp
tdp

మచిలీపట్నం: మచిలీపట్నంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష పిలుపు నేపథ్యంలో దాన్ని విఫల చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం నుంచి మచిలీపట్నంలోని టిడిపి నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునిడిని ఇంటికే పరిమితం చేశారు. అయితే అర్జునుడిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్‌ మొదలయ్యింది. దీంతో టిడిపి నాయకులు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఊహాగానాలు నమ్మవద్దని అడిషనల్‌ ఎప్పీ సత్తిబాబు ప్రకటన చేశారు. టిడిపి , వైసీపీ పార్టీల్లో ఎవరికీ శిబిరాల ఏర్పాటుకు అనుమతించలేదని, అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని ఏఎస్పీ కోరారు. డీఆర్పీ సమావేశం ఉన్నందున శాంతిభద్రత విఘాతానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/