ఫ్యాక్ష‌న్ మూక‌లు రెచ్చిపోతున్నాయి: లోకేశ్

రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్క‌డికి హెచ్చ‌రిక

అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్ వైస్సార్సీపీ పై మండిప‌డ్డారు. ‘ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో టీడీపీ నాయకురాలు శారద గారి ఇంటిపై వైస్సార్సీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని నారా లోకేశ్ అన్నారు. దాడికి సంబంధించిన వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు.

‘రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయం. వైస్సార్సీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా…ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద గారి కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకమాట .. ఆ దాడిలో ఒక ఎస్సైకి కూడా గాయాలు అయ్యాయి.. యథావిధిగా వైస్సార్సీపీ మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు?’ అంటూ వ్యంగ్యంగా అన్నారు నారా లోకేశ్.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/