మీరు గాని, మీ పేషి గాని స్పందించలేదు

అమరావతి దళిత రైతులకు బేడీలు ఘటనపై..వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతి: అమరావతి దళిత రైతులకు బేడీలు వేయడం పట్ల టిడిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే జరిగిందనేలా టిడిపి నేత వర్ల రామయ్య ట్వీట్ చేస్తూ మండిపడ్డారు. ఈ ఘటనపై జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారూ.. అమరావతి దళిత రైతులకు మీ పేషి నుండి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసులు బేడీలు వేశారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై, మీరు గాని, మీ పేషి గాని స్పందించలేదు. మీ మౌనం, అంగీకారంగా తీసుకోవచ్చా? అమాయకులైన సిబ్బందిని సస్పెండ్ చేస్తే ఎలా? ఆదేశించిన పెద్దలపై చర్యలు తీసుకోండి’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/